మార్కెట్లోకి కొత్త లిఫోన్‌

05 June 2009

మార్కెట్లోకి కొత్త లిఫోన్‌
అద్భుతమైన ఫీచర్స్‌తో మూడు సిమ్‌ల ఫోన్‌ మార్కెట్లోకి వచ్చేసింది. జిఎస్‌ఎం, సిడిఎం టెక్నాలజీతో ఈ ఫోన్‌ పనిచేస్తోంది. రెండు జిఎస్‌ఎం సిమ్‌లను, ఒక సిడిఎంఏ సిమ్‌ను ఉపయోగించే విధంగా ఈ ఫోన్‌ని రూపొందించారు. దాదాపు ఐ ఫోన్‌ టెక్నాలజీతో ‘లి ఫోన్‌’ పేరుతో ఈ ఫోన్‌ చెనై్న మార్కెట్లో దొరుకుతోంది. చైనా ఫోన్‌లు మార్కెట్లోకి వచ్చిన తరువాత ఒకే ఫోన్‌లో రెండు సిమ్‌లు మామూలు అయిపోయింది. ప్రస్తుతం మూడు సిమ్‌ల ఫోన్‌ మార్కెట్లోకి రావడం ఫోన్‌ వినియోగదారులు ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రస్తుతం స్లిమ్‌ మోడ ల్‌తో మార్కెట్లోకి వచ్చిన లిఫోన్‌ ఈ ముచ్చట తీరుస్తోంది. అన్నిటికీ మించి మా ర్కెట్లో ఎక్కడైనా దొరికే నో కియా బ్యాటరీని ఈ ఫోన్‌లకు ఉపయోగించుకొనే అవకాశం ఉంది.ఎన్‌ సిరీస్‌లో ఉప యోగించే నోకియా చిన్న పిన్‌ ఛార్జర్‌ తో పాటు, మోటోరోలా ఛార్జర్‌ను కూడా వినియోగించుకొనే అవ కాశం ఉంది. చెనై్న మార్కెట్లో రూ. 4500లకు ఈ ఫోన్‌ లభిస్తుండగా సూళ్ళూరుపేటలో రూ 5000 వరకు విక్రయిస్తున్నారు.

0 comments: